: రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ... నేను అనంతపురం నుంచి పోటీ చేస్తా: పవన్ కల్యాణ్
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. ఇంత వరకు పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని... ఇక నుంచి దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నామని ఆయన తెలిపారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. తాను అనంతపురం నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 60 శాతానికి పైగా టికెట్లను యువతకే కేటాయిస్తామని తెలిపారు.