: ఈసారి అచ్చెన్న కాదు.. అయ్యన్న.. నేడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది ఆయనే
శాసనమండలిలో ఈసారి సీన్ మారబోతోంది. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ఈసారి మంత్రి అచ్చెన్నాయుడికి బదులు మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అచ్చెన్నను కాదని, అయ్యన్నకు ఆ అవకాశం ఇవ్వడంపై కొంత చర్చ నడుస్తోంది. అచ్చెన్నపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉండడం వల్లే ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది. శాసనసభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.