: ఐశ్వర్యా ధనుష్ భరతనాట్య ప్రదర్శనపై విమర్శలు!
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, ప్రముఖ నటుడు ధనుష్ భార్య ఐశ్వర్య న్యూయార్క్ లోని ఐక్య రాజ్య సమితిలో భరత నాట్య ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. ఐశ్వర్యా ధనుష్ చేసిన భరత నాట్యంపై ప్రముఖ నర్తకి, నటి అనితా రత్నం విమర్శలు గుప్పించారు. ప్రదర్శన ఏమాత్రం ఆసక్తికరంగా లేదని ఆమె విమర్శించారు. కాగా, యూఎన్ లో ఐశ్వర్యా ధనుష్ భరత నాట్య ప్రదర్శన సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, తన కూతురి భరత నాట్య ప్రదర్శనపై విమర్శలు చేయవద్దని ఐశ్యర్య తండ్రి రజనీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.