: కూతురి ప్రేమపై కమలహాసన్ గుర్రుగా ఉన్నాడా?
ప్రముఖ నటుడు కమల హాసన్ తన కుమార్తె శ్రుతి హాసన్ విషయంలో ఆగ్రహంగా ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రుతి హాసన్ గత కొంత కాలంగా లండన్ కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్టు కోలీవుడ్ భోగట్టా. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా లండన్ లో కలుసుకున్న వీరిద్దరూ మూడు నెలలుగా ప్రేమలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రుతి బాలీవుడ్ లో ‘బెహెన్ హోగీ తేరీ’ అనే ఆల్బమ్ లో నటిస్తుండగా, ప్రియురాలిని చూసేందుకు మైఖేల్ లండన్ నుంచి ముంబై వచ్చాడని తెలుస్తోంది.
అంతే కాకుండా, ఈ మధ్య ఓసారి లండన్ నుంచి ప్రియుడితో కల్సి చెన్నయ్ వచ్చిన కూతురిని చూసి కమల హాసన్ మండిపడినట్టు తెలుస్తోంది. వీరి ప్రేమ విషయంలో రోజుకో పుకారు పుట్టుకొస్తుందని, అది తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందని కమల్ ఆందోళన చెందుతున్నాడని కోలీవుడ్ పేర్కొంటోంది. అందుకే, ఈ ప్రేమ వ్యవహారంలో కూతురికి కమల్ గట్టిగా క్లాస్ పీకాడని సమాచారం.