: భూమాకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదు: ఎమ్మెల్యే కూన రవి కుమార్
భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ వైషమ్యాలు ఉన్నా శాసనసభలో సాటి సభ్యుడి సంతాప సభకు ప్రతిపక్ష నేత జగన్ హాజరు కాకపోవడం దురదృష్టకరమని, కనీస మర్యాదలను ఆయన పాటించలేదని రవి కుమార్ విమర్శించారు. రాజకీయంగా జగన్ కు నాడు అండగా ఉన్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.