: ఆ రెండు రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారు: కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్
గోవా, మణిపూర్ రాష్ట్రాల గవర్నర్లు బీజేపీకి ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు తమ పార్టీ నేతలను గవర్నర్లు ఆహ్వానించటం లేదని మండిపడ్డారు. కేంద్ర నిర్ణయాల ప్రకారమే గవర్నర్లు నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాగా, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు దక్కలేదు. చిన్న పార్టీల మద్దతుతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే యత్నాల్లో బీజేపీ ఉంది.