: అసెంబ్లీకి హాజరుకాని జగన్ టీమ్... భూమా గురించి మాట్లాడేందుకు వైకాపా నుంచి ఒక్కరూ లేరు!


కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భూమా నాగిరెడ్డికి సంతాప సూచకంగా నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన వేళ, వైకాపా శాసనసభ్యులు ఎవరూ హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి భూమా, ఆళ్లగడ్డ నుంచి ఆయన కుమార్తె అఖిలప్రియ వైకాపా నుంచే పోటీ చేసి విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన మరణించిన తరువాత, ఆయన గురించి మాట్లాడేందుకు ఒక్కరు కూడా లేకపోవడాన్ని, పలువురు శాసనసభ్యులు తప్పుబట్టారు. ఇది కుసంస్కారమని, శత్రువు మరణించినా బాధ పడే దేశంలో, వైకాపాకు కనీస జ్ఞానం లేకపోయిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News