: బాలకృష్ణ గన్ మెన్ కుమారుడి ఆత్మహత్య!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్ మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలోని కాలూరులో ఉన్న నారాయణ విద్యాసంస్థలో 10వ తరగతి చదువుతున్న సాయిచరణ్ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ మందలించడం వల్లే అతను ఈ ఘటనకు పాల్పడినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, మృత దేహాన్ని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.