: భూమాను బతికించుకోవాలని ఎంతో తపించాను: చంద్రబాబు


నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఎలాగైనా బతికించుకోవాలని తాను ఎంతో తపించానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో భూమా మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆయన, భూమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదివారం నాడు జరిగిన ఘటనలను సభ్యులకు చెప్పారు. శనివారం నాడు భూమా తనను కలిసినప్పుడు కూడా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా కనిపించారని, ఆళ్లగడ్డ, నంద్యాల సమస్యల గురించి మాట్లాడారని అన్నారు. ఆపై 24 గంటల వ్యవధిలో ఘోరం జరిగిపోయిందని అన్నారు.

ఆళ్లగడ్డలోని ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉండవని, మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించాల్సి ఉంటుందని, అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అనుభవజ్ఞులు ఉండే అవకాశాలు తక్కువని చెప్పారు. అందువల్లే ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు తీసుకెళ్లే ఆలోచన చేశామని చంద్రబాబు వెల్లడించారు. దాదాపు రెండు గంటల పాటు భూమాను బతికించుకునేందుకే అన్ని ప్రయత్నాలు చేశామని, కానీ విధి బలీయమైనదని అన్నారు.

  • Loading...

More Telugu News