: అశ్రునయనాల మధ్య భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తి
నిన్న గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ నేత, నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఈ రోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన అంతిమ సంస్కారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, భూమా నాగిరెడ్డి బంధువులు, అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. మంచినేతను కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు.