: తహసీల్దార్ వనజాక్షితో అసభ్యకరంగా మాట్లాడిన దుండగుడు
కృష్ణా జిల్లా నూజివీడు తహసీల్దార్ వనజాక్షి పట్ల ఓ గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా సదరు వ్యక్తిపై పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్ డేటా ఆధారంగా ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మరోవైపు వనజాక్షి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది డిమాండ్ చేశారు.