: ఆంధ్రా పాలకులపై విమర్శలతో ప్రారంభమైన ఈటల బడ్జెట్
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం ప్రస్తావనతో మొదలైంది. 50 సంవత్సరాలకు పైగా తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, పాలకులు ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. వరుసగా నాలుగో సారి తనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని, తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రజలే తమ ప్రభుత్వానికి ప్రభువులని చెప్పుకొచ్చారు. ప్రజలే కేంద్రంగా, పేదల సంక్షేమమే ప్రధానంగా పాలన సాగుతోందని ఈటల వెల్లడించారు. ఈటల బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.