: తలకు గాయమై, ముక్కు నుంచి రక్తం కారుతున్నా తీక్షణత తగ్గని బాహుబలి... యూట్యూబ్ లో ట్రయిలర్ శాంపిల్ చూపించిన రాజమౌళి


ప్రపంచ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న "బాహుబలి: ది కన్ క్లూజన్" చిత్రం ట్రయిలర్ శాంపిల్ ను రాజమౌళి పంచుకున్నారు. మరో మూడు రోజుల్లో ట్రయిలర్ విడుదలవుతుందని చెబుతూ, ఓ యూట్యూబ్ వీడియో లింకును పెట్టారు. 12 సెకన్ల నిడివివున్న ఈ వీడియోలో ఓ శివలింగంపై నుంచి రక్తం కారుతుండగా, ఆ పక్కనే రక్తమోడుతూ, కోపంతో చూస్తున్న బాహుబలి (ప్రభాస్)ని చూపించారు. తలకు తగిలిన దెబ్బ, ముక్కు నుంచి రక్తం కారుతున్న స్థితిలోనూ కళ్లల్లో తీక్షణత ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తున్న బాహుబలి మూడు సెకన్ల వీడియో సైతం వైరల్ అవుతోంది. ఈ ఉదయం 10:30కి రాజమౌళి ఈ ట్వీట్ చేయగా, ఇప్పటికే వీడియోను 40 వేల మంది చూశారు.



  • Loading...

More Telugu News