: నాలుగు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన పాకిస్థాన్


పొరుగు దేశం పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాక్ ఉల్లంఘించింది. ఫూంచ్ జిల్లాలోని మల్టీ సెక్టార్ లో పాక్ సైన్యం ఈ రోజు తెల్లవారుజామున కాల్పులు జరిపింది. సరిహద్దుల్లో ఉన్న నాలుగు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. గత 24 గంటల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడటం ఇది రెండోసారి. అయితే, పాక్ కాల్పులకు భారత బలగాలు దీటుగానే జవాబు చెప్పాయి. ఈ కాల్పుల్లో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు.

  • Loading...

More Telugu News