: భూమా నాగిరెడ్డికి ఇష్టమైన నాయకులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి!


కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆళ్లగడ్డలో రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కర్నూలు జిల్లాలో  హ్యాట్రిక్ పార్లమెంటేరియన్ గా రికార్డు సృష్టించిన ఆయనకు సంబంధించిన వివరాలు .. ఆసక్తికర విషయాలు.

భూమా తల్లిదండ్రులు బాలిరెడ్డి, ఈశ్వరమ్మ. స్వస్థలం దొర్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లె. 1964 జనవరి 8న జన్మించిన ఆయన పూర్తి పేరు భూమా వీర నాగిరెడ్డి. హోమియోపతి మెడిసిన్ చదువును ఆయన మధ్యలోనే వదిలేశారు. అన్నలు భూమా వీరప్రతాపరెడ్డి, వీరశేఖర్ రెడ్డి, వీరభాస్కరరెడ్డి కాగా, చెల్లెలు శ్రీదేవి. 1986, ఏప్రిల్ 9న శోభతో ఆయన వివాహం జరిగింది.

ఇక భూమా, శోభా నాగిరెడ్డిల సంతానం విషయానికొస్తే, కుమార్తెలు అఖిల ప్రియ (ప్రస్తుతం ఎమ్మెల్యే), భూమా మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి. భూమా నాగిరెడ్డికి ఇష్టమైన ఆహారం విషయాని కొస్తే, చికెన్ బిర్యానీ. రేంజ్ రోవర్ వాహనంలో ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇక, దివంగత సీఎం టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు నందమూరి తారక రామారావు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి భూమాకి ఇష్టమైన నాయకులు.



  • Loading...

More Telugu News