: ఆ పని సుచిత్ర చేసి ఉండదని అనుకుంటున్నా: గాయని గీతా మాధురి
సుచిత్ర లీక్స్ విషయమై సినీ ఇండస్ట్రీలో పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఒక న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ప్రముఖ గాయని గీతా మాధురి స్పందిస్తూ.. ‘సుచిత్ర ఈజ్ వెరీ స్ట్రాంగ్.. డిప్రెషన్ కు లోనయ్యే మనస్తత్వం కాదు. ఆమె సింగర్ మాత్రమే కాదు రేడియో జాకీ, రైటింగ్ స్కిల్స్ .. ఇలా చాలా ఉన్నాయి. కనుక చాలా అవకాశాలు లభిస్తుంటాయి. చాలా బిజీగా ఉంటుంది. డిప్రెషన్ కు గురయ్యే స్టేజ్ లో ఆమె ఉందని నేను అనుకోవట్లేదు. అయితే, అసలు ఏం జరిగిందో మరి! ... ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.