: భూమా నాయకత్వ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: పవన్ కల్యాణ్
ప్రజా రాజ్యం పార్టీ (పీఆర్పీ)లో భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భూమా నాగిరెడ్డి మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. విషాదాన్ని తట్టుకునే ధైర్యం వారి కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు.