: ప్రధానికి శుభాకాంక్షలు చెప్పిన క్రికెటర్ మహ్మద్ కైఫ్


ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించిన బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి టీమిండియా క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ.. 'అవును, ప్రజలు మాకు ఇచ్చిన మద్దతు చారిత్రాత్మకం...ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయఢంకా మోగించగా, పంజాబ్, గోవా, మణిపూర్ లో ఆశించిన స్థానాలను బీజేపీ కైవసం చేసుకోలేకపోయింది.

  • Loading...

More Telugu News