: భూమా మృతిపై బాలకృష్ణ దిగ్భ్రాంతి
ఏపీ నూతన అసెంబ్లీలో మొన్న భూమా నాగిరెడ్డితో తాను మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్యంగా కనిపించారని, ఒక్కసారిగా ఇలా జరగడం చాలా దురదృష్టకరమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని, రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన భూమా మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఆ పార్టీ నాయకులు ఇప్పటికే నంద్యాలకు బయలుదేరారు.