: స్టార్క్‌ స్థానంలో తదుపరి టెస్టులు ఆడనున్న కమిన్స్‌


ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇంకా కోలుకోక‌పోవ‌డంతో టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు ఆయ‌న‌ స్థానాన్ని పాట్‌ కమిన్స్ తో భర్తీ చేయనున్నారు. 2011లో సౌతాఫ్రికాతో ఆసీస్‌కి జ‌రిగిన‌ టెస్ట్ మ్యాచుతో క్రికెట్‌ ఆట‌లోకి అడుగుపెట్టిన క‌మిన్స్ అనంత‌రం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడలేదు. కాగా, దేశీయ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్‌ తరఫున కమిన్స్‌ ప్రదర్శన సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడంతో మ‌ళ్లీ ఆయ‌న ఇప్పుడు ఆసీస్ జ‌ట్టులో స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియాతో ఆసీస్‌ ఈ నెల 16న మూడో టెస్ట్‌ మ్యాచ్ ఆడ‌నుంది. మొదటి టెస్టులో ఓడిన టీమిండియా రెండో టెస్టులో గెలిచిన విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News