: ప్రపంచ రికార్డు సృష్టించిన శ్రీలంక కెప్టెన్ హెరాత్
శ్రీలంక కెప్టెన్ రంగనా హెరాత్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక 259 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసిన హెరాత్... రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో, టెస్టుల్లో మొత్తం 363 వికెట్లు పడగొట్టాడు. దీంతో, అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ గా హెరాత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకు ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరి (362 వికెట్లు) పేరిట ఉంది.