: సమీక్షించుకోవాలి.... పంజాబ్, గోవా ఫలితాలపై ఆమ్ ఆద్మీ అంతర్మథనం


పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని... తమ పార్టీకి వచ్చిన ఫలితాలపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు అశుతోష్, కపిల్ మిశ్రాలు పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో తమ పార్టీ 100 స్థానాలకు పైగా గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశించామని.. మా అంచనాలన్నీ తారుమారయ్యాయని వారు తెలిపారు. ఈ ఫలితాలు తమను తీవ్ర నిరాశకు గురిచేశాయన్నారు. కానీ పంజాబ్ లో రెండో స్థానంలో నిలవడం కాస్త ఊరటనిచ్చిందన్నారు. ఈ ఫలితాలతో ఆత్మపరీక్ష చేసుకొని తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అశుతోష్, కపిల్ మిశ్రాలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News