: సమాజ్ వాదీ పార్టీలో ముసలం.. అఖిలేష్ పై మండిపడుతున్న వ్యతిరేకులు!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సామాజ్ వాదీ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. బీజేపీ చేతిలో చావు దెబ్బ తినడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనికంతటికీ కారణం అఖిలేషే అని ఓ వర్గం మండిపడుతోంది. ములాయం సింగ్ పై తిరుగుబాటు చేసి, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మొత్తం సర్వ నాశనం చేశారంటూ అఖిలేష్ పై ఆయన వ్యతిరేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసింది చాలు... వెంటనే పార్టీ పగ్గాలను ములాయం సింగ్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ములాయం మాత్రమే పార్టీని విజయపథంలో నడిపించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.