: ఏపీ, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోన్న అంశంపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమ పార్టీయే విజయం సాధిస్తోందని అన్నారు. దేశ ప్రజలంతా మోదీ వైపే చూస్తున్నారని, ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనూ తమ పార్టీ గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల కుల రాజకీయాలకు ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు.