: ఇక‌ తెలంగాణ‌లోనూ దూసుకెళ్తాం.. రాష్ట్రంలో బీజేపీయే ప్ర‌త్యామ్నాయం: ద‌త్తాత్రేయ పిలుపు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న‌ విజ‌యం దిశ‌గా దూసుకుపోతుండ‌డంతో కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని బీజేపీ కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ... ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మోదీని వ్య‌క్తిగ‌తంగా కూడా విమ‌ర్శించారని అన్నారు. అటువంటి వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెప్పారని అన్నారు. ఈ ఫ‌లితాలు మోదీ ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కి చిహ్నం అని అన్నారు. గ్రామీణ ప్రాంత‌వాసులు కూడా మోదీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారని ఆయ‌న అన్నారు. దేశం మొత్తం మోదీ హ‌వా కొన‌సాగుతోందని చెప్పారు. ద‌ళితులు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మ‌హిళ‌ల‌ను శ‌క్తిమంతులుగా త‌యారు చేయాల‌న్న‌దే మోదీ ధ్యేయమ‌ని చెప్పారు. కాంగ్రెస్ ప‌ట్ల ప్ర‌జ‌లు మ‌క్కువ చూప‌డం లేదని  అన్నారు.

తెలంగాణ‌లోనూ బీజేపీకి ఇవే ఫ‌లితాలు వ‌స్తాయని దత్తన్న అన్నారు. తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఏర్ప‌డుతుంద‌ని జోస్యం చెప్పారు. అందుకోసం బీజేపీ కార్య‌క‌ర్త‌లంద‌రూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు గ్రామ గ్రామానికీ వెళ్లాయని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లోనూ మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో దూసుకువెళ‌దామ‌ని పిలుపునిచ్చారు.

More Telugu News