: ఉక్కు మహిళకు ఘోర ఓటమి
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉక్కు మహిళ, ప్రజా హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఘోర ఓటమి చెందారు. తోబల్ నియోజకవర్గంలో ఆమెపై మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో ఆమె డిపాజిట్ కూడా కోల్పోయారు. మణిపూర్ లో హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసినా, ఆమెకు ఓటమి తప్పలేదు. అత్యంత బలమైన ఇబోబిపై ఆమె పోటీ చేయడం ఆమె విజయావకాశాలను దెబ్బతీసింది. ఇబోబికి 18,649 ఓట్లు రాగా, ఇరోం షర్మిలకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బసంత సింగ్ కు 8,179 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో తాను మరోసారి పోటీ చేస్తానని తెలిపారు. మరోవైపు మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.