: యూపీ ముఖ్యమంత్రి రేసులో రాజ్ నాథ్ సింగ్?


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిక్యత దిశగా వెళుతోంది. ఈ నేపథ్యంలో, లక్నోలోని బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున కార్యాలయం వద్ద గుమికూడారు. వీరంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారు. దేశ రాజకీయాలను శాసించే యూపీలో తొలిసారి అధికార పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకోబోతోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎవరు కానున్నారన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ మౌర్యను ముఖ్యమంత్రిని చేస్తారని కొందరు చెబుతున్నారు. కానీ, అనూహ్యంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు కూడా తెర మీదకు వస్తోంది. యూపీకి చెందిన రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన రాజ్ నాథ్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయని మరి కొందరు భావిస్తున్నారు. సీఎం పదవిని ఆయనకు కట్టబెట్టి, ఆరు నెలల కాలంలో ఆయనను అసెంబ్లీకి పంపిస్తారని చెబుతున్నారు. మరి, పార్టీ అధిష్ఠానం చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News