: బాక్సింగ్ దిగ్గజం అలీ కుమారుడికి మరోసారి అవమానం... అదుపులోకి తీసుకున్న యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు


బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ కుమారుడు మహ్మద్ అలీ జూనియర్‌ ను మరోసారి అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 7వ తేదీన తన తల్లితో కలసి ఫోర్ట్‌ లాడర్‌ డేల్‌ హాలీవుడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్ లో ఇబ్బందులు పడ్డ ఆయన, ఈ దఫా వాషింగ్టన్ లో అటువంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్లోరిడా వెళ్లేందుకు ఆయన విమానం ఎక్కుతున్న వేళ, ముస్లిం పేరున్న కారణంగా ఆయన్ను అధికారులు నిలువరించారు. ఆపై 20 నిమిషాల పాటు విచారించారు. తనను ఆపగానే, హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడిన అలీ జూనియర్, తన పాస్ పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్ ను చూపించారు. కాగా, ముస్లిం పేరున్న వారందరినీ అమెరికా అధికారులు ఆపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News