: రెజ్యూమ్ లో ఈ పదాలుంటే ఉద్యోగం డౌటే!: ఎక్స్ పర్ట్స్ సలహా

ఎంత చదువు చదివినా, ఓ మంచి ఉద్యోగం చేయాలన్నదే నేటి యువత లక్ష్యం. ఇందుకోసం తన విద్యార్హతలు, తనలోని లక్షణాలు, గుణాలను వివరిస్తూ, రెజ్యూమ్ ను తయారు చేసుకుని మరీ ఇంటర్వ్యూలకు వెళతారు. అయితే, రెజ్యూమ్ చూస్తే, అభ్యర్థి ఎలాంటి వాడన్న విషయాన్ని 70 శాతం వరకూ చెప్పేస్తుంటామని కొన్ని వేల రెజ్యూమ్ లను చూసిన నిపుణులు వెల్లడించారు. అసలు 80 శాతం మందిని ఈ సీవీలు చూసే వద్దని చెప్పేస్తుంటామని వారో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా చాలా మంది కామన్ పదాలు వాడుతూ ఉంటారని, వీటిని చూస్తే, అతనిలో కనీస ఆలోచనా శక్తి లేదన్న విషయం అర్థమవుతుందని అన్నారు. వారిస్తున్న సలహా ఏంటంటే, ఈ పది పదాలు రెజ్యూమ్ లో లేకుండా చూసుకోవాలని... అవి ఏంటంటే...
1. లీడర్ షిప్ (leadership), 2. స్పెషలైజ్డ్ (specialised), 3. ఎక్స్ పర్ట్ (expert), 4. ఎక్సలెంట్ (excellent), 5. స్ట్రాటజిక్ (strategic), 6. ఎక్స్ పీరియన్స్డ్ (experienced), 7. రెస్పాన్సిబుల్ (responsible), 8. ప్యాషనేట్ (passionate), 9. సర్టిఫైడ్ (certified), 10. డైనమిక్ (dynamic). ఈ పదాలు రెజ్యూమ్ లో లేకుండా చూసుకోవాలన్నది ఎక్స్ పర్ట్స్ సలహా.

More Telugu News