: మోదీ లానే కేజ్రీవాల్ కూడా మోసగాడు: కట్జూ సంచలన వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీలానే కేజ్రీవాల్ కూడా మోసగాడని, మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరేనని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. మోసకారి మోదీకి, కేజ్రీకి ఎటువంటి తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. ముందస్తు అంచనాలు వేసే వారికి అత్యుత్సాహం పనికి రాదని అన్నారు.