: అంపైర్ సిక్సర్ ఇచ్చాడు... బౌలర్ మాత్రం క్యాచ్ అనుకున్నాడు!


క్రికెట్ లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటాయి. అలాంటి ఘటనే శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య శ్రీలంకలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో సుభాషిస్ రాయ్ బౌలింగ్ లో లంక బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ భారీ షాట్ కొట్టాడు. గాల్లో లేచిన బంతిని మరో బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌండరీ లైన్ వద్ద ఒడిసిపట్టుకున్నాడు.

అలా పట్టుకునే క్రమంలో అతని కాలు వెళ్లి బౌండరీ లైన్ ను దాటేసింది. దీంతో అంపైర్ సిక్సర్ ప్రకటించాడు. అయితే, సదరు బంతిని ముస్తాఫిజుర్ క్యాచ్ పట్టడాన్ని మాత్రమే గమనించిన బౌలర్ సుభాషిస్ రాయ్ బ్యాట్స్ మన్ అవుటయ్యాడంటూ చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. దీంతో కుశాల్ మెండిస్ అది క్యాచ్ కాదని, సిక్సర్ అని చెప్పడంతో మౌనం వహించాడు. ఇది అభిమానులను నవ్విస్తోంది. 

  • Loading...

More Telugu News