: మోత్కుపల్లి పార్టీ మారేందుకే కేసీఆర్ ను కలిశారా?
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు పార్టీ మారుతారా? తెలంగాణ సీఎం కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మోత్కుపల్లి కలవడంతో తెలంగాణలో ఆయన పార్టీ మారుతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. టీడీపీలో సుదీర్ఘ కాలంగా క్రియాశీలకంగా లేని మోత్కుపల్లి... పార్టీ తీరుపై సంతృప్తిగా లేరని, దీంతో నేరుగా పార్టీ మారుతానని సంకేతాలివ్వకుండా, కుమార్తె వివాహ ఆహ్వానం పేరుతో సీఎం కేసీఆర్ ను కలిశారని వార్తలు వినిపిస్తున్నాయి.
మోత్కుపల్లి పార్టీ మారుతానంటే కేసీఆర్ కూడా ఆనందంగా ఆహ్వానం పలుకుతారని, మోత్కుపల్లి నిబద్ధత తెలిసిన కేసీఆర్ ఆయనను వదులుకోరని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మాత్రం మోత్కుపల్లి పార్టీ మారే ప్రశ్నేలేదని, కుమార్తె వివాహానికి కేసీఆర్ ను ఆహ్వానించేందుకే ఆయనను కలిశారని చెబుతోంది.