: విరాళంగా రూ.2 వేలకు మించి నగదు తీసుకుంటే కఠిన చర్యలు: రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక
రాజకీయ పార్టీలకు ధారాళంగా వచ్చిపడుతోన్న విరాళాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ ఈ రోజు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తాము విధించిన నిబంధనలకు వ్యతిరేకంగా రూ.2 వేలకు మించి నగదు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఎన్నికల్లో బ్లాక్ మనీ వినియోగం అరికట్టడమే రాజకీయ పార్టీల లక్ష్యం కావాలని తెలిపింది. అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇస్తున్నారని ఎన్నో ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ తేల్చి చెప్పింది.