: నేను సీఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదు: జానా రెడ్డి


తాను సీఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, ఎవరి అభిమానాన్ని బట్టి వారు పిలుచుకుంటారని, అయినా, పది మందితో సీఎం అని పిలిపించుకున్నంత మాత్రాన సీఎం అయిపోతామా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి తన దైన శైలిలో అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను సర్వేలపై ఆధారపడనని, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ సర్వేలు చేయించుకోలేదని అన్నారు. కేసీఆర్ వేసిన మార్కులతో తనకు సంబంధం లేదని, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. మొదట్లో కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఊహించారా? అని ఆయన ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News