: పవన్ కల్యాణ్ తో విడాకులకి కారణం ఉంది...చెబుతా: రేణూ దేశాయ్
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా పలు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడి అభిమానుల్లో ఆసక్తి రేపింది. పవన్ కల్యాణ్ తో సహజీవనం, వివాహం, పిల్లలు, విడాకులు ఇలా తన జీవితంలో అన్నీ చాలా తొందరగా జరిగిపోయాయని తెలిపింది. విడాకులు తీసుకున్నప్పటికీ తమ మధ్య స్నేహం పోలేదని చెబుతోంది. తమ స్నేహితులు తనను దీనిపై చాలా సార్లు ప్రశ్నించారని గుర్తుచేసుకుంది. ఇంత బాగుంటారు కదా? విడాకులెందుకు తీసుకున్నారు? అని అడుగుతారని చెప్పింది. విడాకులకు తన కారణాలు తనకు ఉన్నాయని రేణూ దేశాయ్ తెలిపింది. తన విడాకులకు కారణాలు తన ఆటోబయోగ్రఫీలో పూర్తిగా వివరిస్తానని తెలిపింది. పవన్ తో విడాకుల అనంతరం మరాఠాలో రెండు సినిమాలకు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రేణూ దేశాయ్ కొంత కాలంగా గ్యాప్ తీసుకుంది.