: కనీసం ట్రైలర్ కూడా విడుదల కాలేదు.. అప్పుడే రూ.100 కోట్లు రాబట్టిన షారుక్ సినిమా


బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ద రింగ్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. క‌నీసం ఈ సినిమా ట్రైల‌ర్ కూడా రాక‌ముందే ఈ సినిమా రూ.100 కోట్లు రాబట్టింది. తాజాగా ఎన్‌హెచ్‌ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమా భారత్ స‌హా ఓవర్‌సీస్‌లోనూ సోలో డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. ఈ రైట్స్‌ కిందే షారుక్‌ సినిమాకి వంద కోట్లకు పైగా వచ్చినట్లు స‌మాచారం. ఈ సినిమాలో షారుక్ స‌ర‌న‌స అనుష్క‌శ‌ర్మ న‌టిస్తోంది. ఈ సినిమాకు ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

  • Loading...

More Telugu News