: విచారణకు గైర్హాజరైన హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్!


కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తే, పెడచెవిన పెట్టిన పశ్చిమ బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఆయన కోర్టును ధిక్కరించారని, తాము ఆదేశించినా పట్టించుకోలేదని ఆగ్రహించిన న్యాయమూర్తి, ఆయనపై బెయిలబుల్ వారెంటును ఇష్యూ చేశారు. తదుపరి విచారణను ఈ 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు ఆయన్ను హాజరు పరచాలని ఆదేశించారు. మరోసారి కోర్టుకు గైర్హాజరైతే, నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News