: మరోసారి తండ్రి కాబోతున్న ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ త్వరలోనే మరో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని జూకర్ బర్గ్ తన అధికారిక పేజ్ లో తెలిపారు. తమకు మరో కూతురు పుట్టబోతోందని జూకర్ బర్గ్ తెలిపారు. వీరికి ఇప్పటికే మ్యాక్స్ అనే ఓ అమ్మాయి ఉంది. తమకు మరో అమ్మాయి పుడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జూకర్ బర్గ్ తన ఆనందాన్ని వెల్లడించారు. మరో శక్తిమంతమైన మహిళగా ఆమెను పెంచేందుకు శాయశక్తులా తాను, ప్రిస్కిల్లా ప్రయత్నిస్తామని చెప్పారు. తొలుత తమకు బిడ్డలే పుట్టరని భావించామని... ప్రిస్కిల్లాకు తొలుత మూడు సార్లు గర్భస్రావం అయిందని తెలిపారు. ఆ తర్వాత మ్యాక్స్ జన్మించిందని, ఇప్పుడు మరో బిడ్డ పుట్టబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. రెండో కుమార్తె చాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.