: శేషాచలం అడవుల్లో ఉద్రిక్తత... 179 మంది ఎర్ర దొంగోళ్లు అరెస్ట్
కడప జిల్లా సరిహద్దుల్లోని శేషాచలం కొండల్లో విలువైన ఎర్రచందనం దుంగల కోసం వచ్చిన తమిళనాడు దొంగలు, కూలీల్లో 179 మందిని అరెస్ట్ చేసి, సుమారు 20 టన్నుల దుంగలను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దమొత్తంలో రెడ్ శ్యాండల్ లభించడం, ఇంత ఎక్కువ మంది అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. వీరిలో సేలం, ధర్మపురి, తిరువణ్ణామలై, కృష్ణగిరి తదితర ప్రాంతాల వాసులతో పాటు కర్ణాటకలోని కోలార్ జిల్లా వాసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా, అడవుల్లో అదనపు బలగాలను దించి కూంబింగ్ ను కొనసాగిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కడప, చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.