: ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు


దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీలు విజయం సాధించనున్నాయన్న దానిపై వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు గాను ఫిబ్రవరి 15న జరిగిన ఎన్నికల్లో 68 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఉదయ్ చాణక్య, ఇండియా టుడే, న్యూస్ ఎక్స్ సంస్థలు బీజేపీ భారీ ఆధిక్యంతో గెలవనుందని, 32 నుంచి 53 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 32 స్థానాల మధ్య వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇతరులు 2 నుంచి 6 స్థానాల మధ్య గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పాయి. దీంతో ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 

  • Loading...

More Telugu News