: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దు


తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

బ్యాలెట్ పేపర్లో మూడో నంబర్లో ఉన్న టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, తొమ్మిదో నంబర్లో ఉన్న స్వతంత్ర అభ్యర్థి లక్ష్మయ్యల ఫొటోలు తారుమారయ్యాయి. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు మాణిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, బ్యాలెట్ పేపర్లో ఫొటోలు తారుమారు కావడం నిజమేనంటూ ఈసీకి భన్వర్ లాల్ నివేదిక పంపారు. దీంతో, 19న రీపోలింగ్ నిర్వహించాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News