: అజిత్ కు తన గురించి చెప్పలేదని హీరో విజయ్ సేతుపతి భార్య ఫీలైందట!


సినిమా కథల ఎంపిక విషయంలో నటుడు విజయ్ సేతుపతిని ప్రశంసిస్తూ తమిళ అగ్ర నటుడు అజిత్ ఇటీవల ఆయనకు ఫోన్ చేశాడట. అయితే, తన అభిమాన నటుడు తమ ఇంటికి ఫోన్ చేస్తే, కనీసం, తన గురించి చెప్పలేదంటూ విజయ్ సేతుపతి భార్య ఫీలయ్యారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ‘వివేగమ్’ చిత్రం షూటింగ్ పనులతో బిజీగా ఉన్న అజిత్ కు ఇటీవల కొంచెం తీరుబాటు లభించిందట.

దీంతో, గత ఏడాదిలో తాను చూడలేకపోయిన తమిళ చిత్రాలను వరుసగా చూసేశారట. ఈ క్రమంలో విజయ్ సేతుపతి నటించిన సినిమాలను చూశాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి కథల ఎంపిక బాగుందంటూ ఆయన ఇంటికి ఫోన్ చేసి మరీ చెప్పారట. అయితే, ‘వివేగమ్’ షెడ్యూల్ పూర్తయిన తర్వాత అజిత్ ను కలవాలని విజయ్ సేతుపతి, ఆయన భార్య అనుకున్నారట. ఇంతలోనే అజిత్ ఫోన్ చేసి విజయ్ సేతుపతిని ఆశ్చర్యపరిచాడట. 

  • Loading...

More Telugu News