: స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే సినీ రంగంతో పాటు వ్యాపారం మీద కూడా దృష్టి సారించాడు. బీయింగ్ హ్యూమన్ పేరుతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. త్వరలోనే ఓ మొబైల్ బ్రాండ్ ను కూడా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మొబైల్ కంపెనీ కోసం బీయింగ్ స్మార్ట్ అనే ట్రేడ్ మార్క్ ను కూడా రిజిస్టర్ చేయించాడు. ఈ కంపెనీ నుంచి పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను తయారు చేసి, మార్కెట్లోకి తీసుకురానున్నాడు. తన స్మార్ట్ ఫోన్ల కంపెనీ ద్వారా వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని సమాజ సేవకే ఉపయోగిస్తానని చెప్పాడు సల్లూభాయ్.