: ఆమెకు ఈత రాదు, లైఫ్ జాకెట్ వేసుకోలేదు... అయినా నదిలో దూకినా మునగలేదు!
కొన్ని అద్భుతాలు లాజిక్ కు దొరకకుండా జరుగుతుంటాయి. చైనాలోని గువాంగ్ డంగ్ ప్రావిన్స్ లో ఓ మహిళ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుని, వంతెనపై నుంచి నదిలో దూకేసింది. ఆమెకు ఈత రాదు, ఆమె ఒంటిపై లైఫ్ జాకెట్ లేదు. మామూలుగా లోతు ఎక్కువగా వున్న నీళ్లలోకి ఎవరైనా దూకితే నీట మునిగి ప్రాణాలు కోల్పోతారన్న సంగతి తెలిసిందే. ఆమె మాత్రం నీట మునగలేదు. నీటిపై తేలుతూ ఉండిపోయింది. చాలా సేపు ఆమె నీట మునగకుండా అలాగే ఉండిపోయింది.
అదే సమయంలో ఆ నదిలో చేపలు పట్టుకునేందుకు వచ్చిన జాలర్లు ఆమెను చూసి ఆశ్చర్యపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆమెను అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఆమె మునిగిపోకపోవడానికి కారణం ఆమె శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అని వారు తెలిపారు. దానికి ఆమె ధరించిన దుస్తులు కొంత సహకరించాయని, దీంతో ఆమె నీట మునగకుండా చాలా సేపు తేలుతూ ఉండిపోయిందని అన్నారు.