: పాతబస్తీలో ఓ వ్యక్తిని చితక బాదిన రౌడీ షీటర్లు!
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్లు హల్ చల్ చేశారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్ లో ముగ్గురు రౌడీ షీటర్లు కలిసి ఓ వ్యక్తిని చితకబాదారు. టోలి చౌక్ కు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ ఆదిల్ తో పాటు మహ్మద్ ఫైసల్, మహ్మద్ ఫర్దన్ లు అఫ్జల్ అనే వ్యక్తిని చితక బాదారు. ఈ సంఘటనపై బాధితుడు గోల్కొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, అఫ్జల్ పై దాడి చేస్తున్న దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ముగ్గురు రౌడీషీటర్లు అతనిపై దాడి చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.