: బ్యాలెట్ పేపర్ మొదటి ప్రూఫ్ సరిగ్గానే ఉంది... ఆపై ఫోటోలు మారాయి... చాలా తీవ్రమైన నేరమిది: భన్వర్ లాల్
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫోటోలు ఎక్కడ, ఎలా మారాయో విచారించి తేలుస్తామని ఈసీ భన్వర్ లాల్ తెలిపారు. తమకు వచ్చిన మొదటి ప్రూఫ్ సరిగ్గానే ఉందని, అందులోని ఫోటోలను ఎన్నికల అధికారులు సరిపోల్చారని చెబుతూ, ఆ కాగితాలు తన వద్దే ఉన్నాయని అన్నారు. ఆపై ఫైనల్ ప్రింటింగ్ లో ఫోటోలు ఎవరు మార్చారన్నది సస్పెన్స్ గా ఉందని, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అన్న విషయంపైనా విచారణ జరుగుతోందని తెలిపారు. కావాలని ఫోటోలు మారిస్తే మాత్రం అది చాలా తీవ్రమైన నేరమని, ఈ విషయంలో జాతీయ ఎన్నికల కమిషన్ కు విషయమంతా తెలిపామని, వారు సూచించిన విధంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు.