: హైదరాబాద్, ఇందిరాపార్కులో ఇక 'ధర్నాచౌక్' కనిపించదు... నిరసన తెలపాలంటే, శివారుకు వెళ్లాల్సిందే!

హైదరాబాద్ లోని ధర్నా చౌక్... ఈ పేరు తెలియని వారుండరు. నగరం నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఇందిరాపార్కును ఆనుకొని ఉన్న నిరసనలు తెలిపే ప్రాంతమే ధర్నాచౌక్. ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజా సంఘాలు అయినా, సాధారణ ప్రజలు అయినా, తమ నిరసనలు తెలిపేందుకు ఇక్కడికే వస్తారు. ఎన్నో ఉద్యమాలు ఇక్కడే పుట్టాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సైతం ధర్నాచౌక్ లో ఎన్నో రోజులు కొనసాగింది.

అటువంటి ధర్నా చౌక్ ను తొలగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఎవరైనా ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టాలంటే, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే చేయాల్సి వుంటుందని స్పష్టం చేసింది. నగరం మధ్య ధర్నాలతో భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ, ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కారు. ఘట్ కేసర్, జవహర్ నగర్, శంషాబాద్, గండిమైసమ్మ చౌరస్తాల్లోనే ఇకపై ధర్నాలకు అనుమతి ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసనకారులను హైదరాబాద్ లోనికి రానిచ్చేది లేదని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

More Telugu News