: స్నేహితురాలి ప్రైవేట్ ఫొటోలను పోర్న్‌వెబ్‌సైట్‌లో పెట్టిన బీటెక్ స్టూడెంట్ అరెస్ట్


స్నేహితుడని నమ్మి తన ప్రైవేటు ఫొటోలు పంపిస్తే వాటిని పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మూడు రోజుల క్రితం బాధితురాలి బంధువు దిలీప్‌ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో నిందితుడు నవీన్ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన నవీన్ ప్రసాద్ అక్కడే బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాధిత యువతి, నవీన్ కలిసి 2013-15లో హైదరాబాదులోని నిజాంపేట క్రాస్‌రోడ్డులోని ఓ కళాశాలలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు నవీన్‌ను మందలించారు. దీంతో స్నేహితులుగా ఉందామంటూ యువతిని నమ్మించిన నవీన్ ఫేస్‌బుక్‌లో తరచూ టచ్‌లో ఉండేవాడు.

యువతి అతడి మాటలు నమ్మింది. ఈ క్రమంలో ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పంపాలంటూ యువతిని కోరాడు. అతడిని నమ్మిన ఆమె వాట్సాప్ ద్వారా వాటిని పంపింది. వీటిని అందుకున్న నవీన్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు వాటిని పోర్న్‌వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి వాటి లింకులను బాధితురాలికి పంపాడు. దీంతో ఈ విషయాన్ని బంధువైన దిలీప్ కుమార్‌కు చెప్పిన యువతి తనకు సాయం చేయాలని కోరింది. వాటిని చూసిన దిలీప్ కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో యువతి ఇద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శనివారం దిలీప్‌ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన నవీన్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News