: పాదాల కింద బంగారు బిస్కెట్లు... అధికారులకు చిక్కిన కేటుగాడు!
విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చే క్రమంలో కేటుగాళ్ల రూటే వేరు. సోదాలు నిర్వహించే అధికారులకు చిక్కకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వారికన్నా తెలివైన అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ రోజు అటువంటి ఘటనే మరొకటి ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులలో ఒకరు 12 బంగారు బిస్కెట్లను రెండు కాళ్ల పాదాలకు అతికించుకుని వచ్చాడు. అధికారులు అతడిని క్షుణ్ణంగా పరిశీలించడంతో చివరికి పట్టుబడ్డాడు. ఒక్కో పాదానికి ఆరేసి బిస్కెట్లు అంటించుకొని వచ్చాడని, ఆ బంగారం 100 గ్రాములు ఉంటుందని అధికారులు చెప్పారు. వీటి ధర రూ. 36,45,600 ఉంటుందని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.