: ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు నా కులం గురించి అడుగుతున్నారు: ప్రకాశ్ రాజ్ ఆవేదన


తన కులం అడుగుతున్నారని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నడిగుడయిన ప్రకాశ్ రాజ్ ను దక్షిణాదికి సంబంధించిన ప్రతి రాష్ట్రం వారు తమవాడే అనుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలు అవలీలగా మాట్లాడే ప్రకాశ్ రాజ్ హిందీలో కూడా నటుడిగా విజయం సాధించాడు. సుమారు 20 సినిమాలు నిర్మించిన ప్రకాశ్ రాజ్ తమిళనాడులో జరగనున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు.

దీంతో తమిళనాడులో ఒక్కసారిగా ప్రకాశ్ రాజ్ ను ఓడించేందుకు స్థానికత, కులం ప్రాతిపదికగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఛైర్మన్ పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ తెలుగోడంటూ విమర్శలు చేస్తూ, ఓడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇన్నాళ్లు లేని స్థానికత, కులం విమర్శలు తనను కూడా చుట్టుముట్టాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఎన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశాడు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, నిర్మాతల మండలి నిర్లక్ష్యాన్ని వదిలిస్తానని ప్రకాశ్ రాజ్ ఘంటాపథంగా చెబుతున్నాడు. 

  • Loading...

More Telugu News